Wednesday, June 1, 2011

aliens

గ్రహాంతరవాసులకై మనము ఎంతవెతికినా ఎందుకు కనిపించడము లేదు?

గ్రహాంతరవాసులు ప్రతిగ్రహం మీద ఉన్నారు.మనము ఎంతశక్తివంతమైన టెలీస్కోపు ద్వారా ఆకాశంలోనికి చూసినా ఎవరూ కనిపించరు.కారణం ఆయా గ్రహాల్లో ఉండే జీవులు తమ సాంకేతి పరిజ్ఞానంతో అ గ్రహాల రహస్యాలను కాపాడుకొంటుంటారు.వారికై వారు మనతో సంబంధం పెట్టుకొంటే తప్ప,మనము మాత్రము వారిగురించి ఎప్పటికీ తెలుసుకోలేము.మనకంటే సాంకేతికపరిజ్ఞానంలొ వారు చాలా అడ్వాన్సుడుస్టేజీలో ఉన్నారు.ఫ్రెంచి జ్యోతిష్కుడు నొస్ట్రడామస్ మాత్రం వారు మనతో సంబంధం పెట్టుకొంటారు అని చెప్పాడు.
ఈ విశాల విశ్వంలో మనము తప్ప వేరే ప్రాణి లేనేలేదా?ఊరికినే గ్రహగోళాలన్నీ పనీపాటాలేకుండా అలా ఆకాశంలో తిరుగుతున్నాయా?మనమే విశ్వంలో మొనగాళ్ళమా?మనని మించిన గొప్పవాళ్ళు వేరెక్కడా లేరా? ఉన్నారు.ఉన్నారు.కానీ వాళ్ళద్రష్టిలో మనము చాలా క్రిందస్థాయి వాళ్ళమని అనుకొంటారని కొందరు అంటారు.
గ్రహాంతరవాసుల గురుంచి రకరకాలుగా కథలు ఉన్నాయి.వాటిలో ఏదినిజమో ఏది కాదో మనకి తెలియదు.


నాకు serve to you
తెలిసిన మన తెలుగు పేపర్లలో ప్రచురించబడిన విషయాలను రోజూ ఇక్కడ ప్రస్తావిస్తాను.
గ్రహంతరవాసులు మనమధ్యనే మానవ ఆకారంలోనే ఉన్నారని చాలామంది నమ్ముతారు.గ్రహంతరవాసులపై పరిశోధనలు చేసేవారిని వారు ఆకాశంలోకి తీసుకుపోయి అక్కడ స్పేసులో వదిలేస్తున్నారు అని కొంతమంది చెప్తారు.చంద్రుడిమీద నుండి వారు భూమి మీదకు వస్తున్నారు కొంతమంది,కాదు మార్స్ (కుజుడు) నుంచి అని కొందరి మాట.వారు ఎక్కడనుంచి వస్తున్నారని కాదు,ఎంత శక్తిమంతులనేది మనము గుర్తించాలి.సాంకేతిపరంగా వారు మనకంటే ముందున్నారని మాత్రం అందరూ ఒప్పుకుంటారు.మనము పరిశోధనల కోసం కుక్కలను,పందులను,ఎలుకలను,కుందేళ్ళను ఎలాగైతే వాడుకుంటామో ,అలాగనే గ్రహాంతరజీవులు మనలను వారి పరిశోధనల నిమిత్తం వాడుకొనుటకొసమే మనలో కొంతమందిని మన భూమిమీద అక్కడక్కడ కిడ్నాప్ చేసి వారిలోకంలోకి తీసుకుపోతున్నారని ఒక మాట వినిపిస్తున్నది.అవే మనలోకంలో సాల్వుకాని రకరకాల దేశాల్లోని మిస్సింగు కేసులుగా నమోదవుతున్నాయి.గ్రహాంతరవాసులను మనవారు జయించినట్లుగా మనవారు ఇంగ్లీషు మొదలైన భాషల సినిమాల్లో చూపిస్తుంటారు.నిజంగా అలాటివారు మనకు తారసపడితే నిజానికి అలాంటివారిని ఎదుర్కొనేందుకు మనదగ్గరవున్న సాంకేతిక పరిజ్ఞానము సరిపోదు.తప్పనిసరిగా వారి చేతిలో ఓడిపోతాము.ప్రస్తుతము అమెరికా ఏ ఖండాన్నైనా కేవలము 15 నిమిషాల వ్యవధిలోనే ముక్కలుగా చెయ్యగలదు.ఎందుకంటే అమెరికా దగ్గిర ఇంటర్ కాంటినెంటల్ మిస్సయిల్సు ఉన్నయి.వాటితో ఏ కాంటినెంట్ ను అయినా నాశనం చెయడానికి 15 నిమిషాలు సరిపోతాయి.

No comments:

Post a Comment